Minister Roja launched Jagananna Sports Club app
mictv telugu

ఏపీలో ‘జగనన్న స్పోర్ట్స్ క్లబ్’ యాప్.. ఆవిష్కరించిన మంత్రి రోజా

September 7, 2022

ఏపీలో ప్రభుత్వం తరపున మరో కొత్త యాప్ వచ్చేసింది. ఇప్పటికే చెత్త, ఆసుపత్రులు అంటూ వివిధ రకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా జగనన్న స్పోర్ట్స్ క్లబ్ పేరిట యాప్ వచ్చింది. క్రీడల మంత్రి రోజా సచివాలంయ బ్లాక్ 2 లో ప్రారంభించారు. అంతకుముందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా క్రీడాకారులు తమ వివరాలు అందజేస్తే, వారి సమాచారం క్రీడా శాఖకు ఈజీగా చేరుతుందని వెల్లడించారు. దీంతో క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందజేసే వీలు కలుగుతుందని వివరించారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు ప్రోత్సాహం లేక నిరుత్సాహానికి గురవకుండా యాప్ ద్వారా తమకు ఉన్న నైపుణ్యాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. క్రీడల్లో రాష్ట్రం మరింత ముందుకెళ్లేందుకు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఈ యాప్ ఓ వారధిలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీని ద్వారా ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.