Minister Roja made satirical comments on Pawan Kalyan
mictv telugu

ముఖ్యమంత్రి, ప్రధాని అయ్యే సత్తా పవన్ కల్యాణ్‌లో ఉంది : మంత్రి రోజా

June 7, 2022

వైసీపీ మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. ఆయనకు ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి అయ్యే సత్తా వుంది కానీ, కేవలం సినిమాల్లో మాత్రమే అవకాశముందని, నిజ జీవితంలో కాదని ఎద్దేవా చేశారు. ఆయన రియల్ హీరో కాదు రీల్ హీరో అంటూ సెటైర్లు వేశారు. రెండున్నర గంటల సినిమాల్లో ఆయనకు ఆ అవకాశం ఉంది కానీ, రియల్ లైఫ్‌లో మాత్రం అస్సలు సాధ్యం కాదని అన్నారు. చంద్రబాబు, పవన్‌లకు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదని విమర్శించారు. పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన వైసీపీని ఎదుర్కోలేరని, సింహం సింగిల్‌గా వచ్చి మరోసారి అధికారం నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ 160 స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. మంగళవారం తిరుపతిలో వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో మంత్రి పై విధంగా స్పందించారు.