భీమవరంతో భీమ్లానాయక్ బిగిసుకుపోయారు - మంత్రి సెటైర్ - MicTv.in - Telugu News
mictv telugu

భీమవరంతో భీమ్లానాయక్ బిగిసుకుపోయారు – మంత్రి సెటైర్

July 5, 2022

ఏపీ మంత్రి రోజా ప్రతిపక్ష పార్టీల నాయకులపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘చంద్రబాబు, లోకేష్‌లు పవన్‌ని జాకీలు పెట్టి లేపుదామని ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆ జాకీలు విరిగిపోయాయి. కేసీఆర్‌కి భయపడి చంద్రబాబు అప్పడు ఏపీకి వచ్చేశాడు. ఇప్పుడు జగన్‌ని చూసి హైదరాబాదుకు పారిపోయాడు. మంత్రిగా ఉంటూ ఓడిపోయిన లోకేష్.. జగన్‌తో సమానం అనుకుంటున్నాడు. దేశమంతా గర్వించేలా ప్రధాని మోదీని స్వాగతించి అల్లూరి విగ్రహం ఆవిష్కరించాం. భీమవరంలో జరిగింది చూసి భీమ్లానాయక్ బిగుసుకుపోయారు. చంద్రబాబు నీరుగారిపోయారు. కార్యక్రమానికి రావాలని పిలిచినా సమయం లేక రాలేదని పవన్ అంటున్నారు. దీన్ని బట్టి మన్యం వీరుడికి ఆయన ఇచ్చిన విలువ ఎలాంటిదో అర్ధం చేసుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు.