Minister Roja responded on Gorantla Madhav video affair.
mictv telugu

ఎంపీ గోరంట్ల వీడియోపై మంత్రి రోజా ఏమన్నారంటే

August 7, 2022

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో.. నిజమో కాదో తెలుసుకోకుండా టీడీపీ నేతలు విమర్శలు చేయడంపై ఏపీ మంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు. కాయలు ఉన్న చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవన్నారు. ఈ వీడియో ఘటనపై ఎంక్వయిరీ జరుగుతోందని.. అప్పుడే అంత తొందరెందుకు అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా రోజా ఎక్కడ అని అడుగుతున్నారంటే.. టీడీపీ, జనసేనలకు తన మీద ఎంత ప్రేమ ఉందోనని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రజల ఆశీస్సులతో తాను మంత్రి కావడం చూసి టీడీపీ నేతలు జెలసీ ఫీలవుతున్నారని రోజా చురకలు అంటించారు.

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది మహిళలపై దారుణమైన ఘటనలు జరిగాయని.. వాటిపై గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని మంత్రి రోజా ఆరోపించారు. నారాయణ స్కూలులో ఎంతో మంది ఆడపిల్లలు చనిపోయారని.. ఈ ఘటనలకు సంబంధించి ఒక్క కేసు కూడా పెట్టలేదని విమర్శలు చేశారు. మహిళలకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే జగన్ వదిలిపెట్టరని.. సీరియస్ యాక్షన్ తీసుకుంటారని రోజా తెలిపారు.