Minister Roja Sensational Comments On Tdp leaders
mictv telugu

వాళ్లంతా ఏకమైనా.. కొడాలి నాని వెంట్రుక కూడా పీకలేరు.. రోజా

September 15, 2022

ఏపీ మంత్రి రోజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులకు పనీ పాట లేదని, వారి ఛానల్స్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. మూడేళ్లుగా ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబుపై కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు చేపడుతున్న నిరసనల్ని మంత్రి రోజా ఇవాళ తప్పుబట్టారు. కొడాలి నాని భాషలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. ఆయన పై ఈగ వాలితే సహించేది లేదన్నారు. టీడీపీ నేతలు రౌడీయుజం చేస్తూ ఇళ్ళపై దాడి చేస్తారా అని మంత్రి రోజా ప్రశ్నించారు. రాంగ్ రూట్ లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ సీఎం జగన్ పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తామంటూ హెచ్చరించారు.

మూడు రాజధానుల బిల్లు పెట్టే దమ్ము టీడీపీకి ఉందా? అని రోజా అన్నారు. అమరావతి కావాలా, మూడు ప్రాంతాలు కావాలా అని ప్రజలను టీడీపీ నేతలు అడగాలన్నారు. లోకేష్ ఒక పిల్లి పిత్రి అని.. తల్లి, భార్య సహాయంతో చంద్రబాబును బెదిరించి, దొడ్డి దారిన మంత్రి అయ్యాడని, అలాంటి నువ్వు సీఎం జగన్‌ని విమర్శిస్తావా? అంటూ రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. లోకేష్ ఒక అడ్రస్ లేని వెధవ అని.. ఏది పడితే అది మాట్లాడితే జనాలు కొట్టిస్తామని రోజా వార్నింగ్ ఇచ్చారు. తాను, కొడాలి నాని టీడీపీ నుంచే వచ్చామని.. నాడు ఎన్టీ రామారావు అభిమానులుగా తాము టీడీపీలో ఉన్నామని రోజా చెప్పారు. టీడీపీ వాళ్లంతా కలిసినా కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరన్నారు. టీడీపీ నేతలు ఎవరైనా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపైకు వస్తే తరిమి తరిమి కొడతామన్నారు