Minister Roja Serious Comments On Nara Lokesh.
mictv telugu

నారా లోకేష్‌కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్

August 31, 2022

కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. లోకేష్ మాటలు వింటుంటే మాయాబజార్ లోని ఉత్తర కుమారుడు గుర్తుకు వస్తున్నాడంటూ రోజా ఎద్దేవా చేసారు. సీఎం జగన్ కాలిగోటికి కూడా సరిపోని నీకు ఆయనను విమర్శించే స్థాయి వుందా? అంటూ రోజా సూటిగా ప్రశ్నించారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది అంటూ రోజా ఫైర్ అయ్యారు.

ఎంతసేపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దాడులు చేయించడం.. ముఖ్యమంత్రి జగన్‌పై నిందలు వేయించడం తప్ప లోకేష్, చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసి రెవెన్యూ డివిజన్‌గా మార్చింది జగన్.. అక్కడి నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. జలసిరులు తెస్తోంది తమ ప్రభుత్వం అన్నారు. ఇది చూసే స్థానిక ఎన్నికల్లో కుప్పం ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పారన్నారు.

”మీ తండ్రి కొడుకులకు అసలు సిగ్గుందా. మీ నాన్న ఇప్పటివరకు కుప్పానికి ఏం చేసాడో చెప్పుకోలేకపోయాడు. కానీ జగన్ కుప్పంకు ఎంతో చేసాడు . కాబట్టే ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ మీ పూసాలు కదిలేలా కుప్పం ప్రజలు బుద్దిచెప్పారు. మీ అమ్మను కన్న నాన్నను అడుగు మీ నాన్న ఎంత గొప్పోడో చెబుతాడు. అడ్డదారిలో సీఎం అయ్యింది నీ తండ్రి చంద్రబాబు. మీ నాన్నని జగన్ కుప్పం నడిరోడ్డులో కూర్చోబెట్టడం ఖాయం” అంటూ లోకేష్ పై పర్యాటక శాఖ మంత్రి రోజా తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.