జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబులపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. ఇటీవల పవన్ కళ్యాణ్ తనపై ‘డైమండ్ రాణి’ అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని విమర్శించారు. ఇక నాగబాబుపై కూడా నిప్పులు చెరిగింది రోజా. ఇటీవల తనను మునిసిపాలిటీ చెత్త కుప్పతో పోల్చిన నాగబాబుపైన రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు వయసు పెరిగిందే కానీ బుద్ధి మాత్రంపెరగలేదన్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబులకి ఈ నేపథ్యంలో రోజా వ్యాఖ్యలపై నాగబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇక పవన్, నాగబాకులకు ఈగోలు ఉన్నాయని ఆరోపించింది రోజా. పవన్, నాగబాబులకు స్క్రిప్ట్‌లు చదవడం మాత్రమే తెలుసునని.. ఇటీవల జరిగిన సభలో పవన్ యువతులతో కలిసి డ్యాన్స్ చేయడం సరికాదని, అన్నింటిలోనూ ఫెయిల్యూర్ అని ఆమె విమర్శించారు. చిరంజీవి ఉండటం వల్లే పవన్‌కి సినిమా అవకాశాలు వచ్చాయని, కానీ తాను మాత్రం స్వయం కృషితో ఎదిగానని రోజా పేర్కొన్నారు. ఇక జగన్‌లా తాను పోటీ చేయలేనని గెలవలేనని పవన్ కల్యాణ్ ఒప్పుకున్నాడని రోజా హాట్ కామెంట్స్ చేశారు. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టలేనని మొన్నటి మీటింగులో ఆయనే చెప్పుకున్నారని రోజా గుర్తు చేశారు.