నందమూరి బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో మంచి పేరు తెచ్చుకుంది. సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి వారితో మాట్లాడడం, ప్రేక్షకులకు తెలియని విషయాలను చర్చించడం వంటివి ఆకట్టుకుంటున్నాయి. చంద్రబాబు – లోకేష్, ప్రభాస్ – గోపీ చంద్, శర్వానంద్ – అడవిశేష్ ఇలా సెలెబ్రిటీలు షోకి వచ్చి సందడి చేశారు. దీంతో ఆహా కూడా రికార్డు స్థాయిలో సబ్ స్క్రైబర్లు పెరిగారు. ఈ నేపథ్యంలో ఏపీ పర్యాటక మంత్రి రోజా కూడా షోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటివరకు రాలేదు. దీనిపై ఆమె స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘షోకి రావాలని బాలయ్య నన్ను ఎప్పుడో పిలిచారు. కానీ నేనే వెళ్లలేదు. వెళ్తే సీఎం జగన్ దగ్గర ఎవరేం చెప్తారోనని భయపడ్డాను. బాలయ్య అంటే ఎంతో గౌరవం. అప్యాయంగా మాట్లాడతారు. రాజకీయాలు, వ్యక్తిగత జీవితం వేరని చెప్తుంటారు. అలాగే జగన్ కూడా నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. జబర్దస్త్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది జగన్ కి నా గురించి రకరకాలుగా చెప్పారు. కానీ ఆయన పట్టించుకోలేదు సరికదా ఎప్పుడూ వాటి గురించి అడగలేదు’ అని తెలిపారు.