Minister Sabitha Indra Reddy Will Meet Governor Tamilisai Today Evening
mictv telugu

ఈ సాయంత్రం రాజ్‌భ‌వ‌న్‌కు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

November 10, 2022

Minister Sabitha Indra Reddy Will Meet Governor Tamilisai Today Evening

గత మూడు రోజులుగా తెలంగాణలో ప్రగతి భవన్ వర్సెస్ రాజ్‌భవన్ కాంట్రవర్సీ నడుస్తోంది. యూనివర్శిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై. అయితే దీనిపై తొలుత తమకు యూనివర్శిటీ బిల్లు విషయంలో ఎలాంటి సమాచారమూ అందలేదన్న మంత్రి సబితా.. ఆ తర్వాత తమకు లేఖ అందిందని స్పష్టం చేశారు. తెలంగాణ‌లోని యూనివ‌ర్సిటీల ఉమ్మడి నియామ‌క బోర్డుపై గ‌వ‌ర్నర్ త‌మిళిసై సందేహాల్ని తాము నివృత్తి చేస్తామని, న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను వివ‌రిస్తామ‌ని తెలిపారు. తాము అపాయింట్‌మెంట్ కోరామని, ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.

కాగా ఆ అపాయింట్‌మెంట్ ఈ రోజు ఖరారైంది. సాయంత్రం 5 గంట‌ల‌కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో స‌మావేశం కానున్నారు. రాజ్ భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ భేటీలో ఉన్న‌త‌ విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొన‌నున్నారు. వ‌ర్సిటీల ఉమ్మ‌డి నియామ‌క బోర్డుపై న్యాయ‌ప‌ర‌మైన అన్ని అంశాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రిస్తామ‌ని తెలిపారు. అలాగే తాను నిజాం క‌ళాశాల హాస్టల్ వివాదంపై మాట్లాడతానని చెప్పారు.