Minister Satyavathy Rathore criticized Telangana Governor Tamilisai
mictv telugu

గవర్నర్ తన పని తాను చేసుకుంటే మంచిది – మహిళా మంత్రి షాకింగ్ కామెంట్స్

September 8, 2022

తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య ఉన్న మనస్పర్ధ మరోసారి తెరపైకి వచ్చింది. గవర్నర్‌గా మూడేళ్లు పూర్తైన సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ఎవరేమనుకున్నా తన పని తాను చేస్తూ పోతానని, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆగనని స్పష్టం చేశారు. తనకు వ్యక్తిగత మర్యాద అవసరం లేదని, రాజ్ భవన్‌ను గౌరవించాలని అభిప్రాయపడ్డారు. రాజ్ భవన్‌కు ఎవరూ రావడం లేదని, అదేమైనా అంటరాని స్థలమా? అని వాపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. గవర్నర్‌గా కాకుండా ఒక బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపని తాను చేసుకుంటే బాగుంటుందని, కానీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు వస్తే మీరెందుకు వెళ్లారని ప్రశ్నించారు. చరిత్ర తెలియక విమోచన దినోత్సవం అంటున్నారని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ మహిళలంటే చాలా గౌరవం ఇస్తారని తెలిపారు.