ఆగకుండా 50 డిప్స్ కొట్టిన మంత్రి (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఆగకుండా 50 డిప్స్ కొట్టిన మంత్రి (వీడియో)

November 26, 2019

Minister Srinivas Goud hitting 50 dips without stopping

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాన్‌స్టాప్‌గా 50కి పైగా డిప్స్ కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మీరు చాలా గ్రేట్ సర్ అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ‘ఫ్రీడం హైదరాబాద్ 10కే రన్’ 17వ ఎడిషన్ జరిగిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

 

జెండా ఊపి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ రన్‌లో 15 వేల మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు. శరీర ఫిట్‌నెస్‌కు పరుగు అనేది ప్రాథమిక అభ్యసన అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి స్టేజీపై ఆగకుండా డిప్స్ కొట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. 50 పైగా డిప్స్‌ను మంత్రి ఆగకుండా తీశారు. ఆయన ఫిట్‌నెస్ చూసి అందరూ అబ్బురపడ్డారు. కాగా, ‘ఫిట్‌నెస్‌ను మీ ఇష్టమైన అలవాటుగా చేసుకోండి’ అని పేర్కొంటూ మంత్రి తన ట్విటర్‌లో వీడియోను పంచుకున్నారు.