Minister Srinivas Goud serious warning to bandi Sanjay
mictv telugu

బండి సంజయ్.. నాలుక చీరేస్తా: మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

May 6, 2022

Minister Srinivas Goud serious warning to bandi Sanjay

పచ్చబడ్డ పాలమూరును పాదయాత్రల పేరిట BJP నాయకులు విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికలు రాబోతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర పేరిట వసూళ్ల కు పాల్పడుతూ.. కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడన్నారు.

సిగ్గు, శరం, లజ్జ లేకుండా బీజేపీ నేతలు నిన్న పాలమూరులో మాట్లాడారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, మంత్రులను పట్టుకుని వాడు, వీడు అంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. అదృష్టంలో గెలిచి ఎంపీ అయిన సంజయ్.. కౌన్సిలర్ స్థాయికి కూడా పనికి రాడని, అసలు తెలంగాణ ఉద్యమంలో ఎక్కుడున్నావ్ అంటూ ‘బండి’పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఒక పులి లాంటోడని అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా, కేసీఆర్ కు తెలంగాణ ప్రజలన్నా పంచ ప్రాణాలని చెప్పారు.

తెలంగాణ పుట్టుక నుంచే బీజేపీ ఈ రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తోందని, రాష్ట్రం రాగానే పోలవరానికి ఏడు మండలాలు, సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఏపీ కి బీజేపీ కట్టబెట్టిందన్నారు. సంజయ్ ఓ లుచ్చా లాగా , బద్మాష్ , లఫంగ ,వీధి రౌడీ లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.