రైస్ మిల్ల‌ర్ల‌కు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్‌ - MicTv.in - Telugu News
mictv telugu

రైస్ మిల్ల‌ర్ల‌కు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్‌

April 14, 2022

 10

తెలంగాణ వ్యవ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి రైస్ మిల్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వేల్పూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి ఇటు రైతుల‌కు అటు ధాన్యం కొంటున్న రైస్ మిల్ల‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన మేర‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించాలంటే.. తేమ లేకుండా ధాన్యాన్ని ఎండ‌బెట్టుకుని మ‌రీ కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల‌ని రైతుల‌కు సూచించారు. అదే స‌మ‌యంలో రైతుల వ‌ద్ద చేతివాటం ప్ర‌ద‌ర్శించేందుకు య‌త్నిస్తే, క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న రైస్ మిల్ల‌ర్ల‌ను హెచ్చరించారు. అంతేకాకుండా మంచి ధాన్యం నుంచి కిలో.. త‌రుగు తీసినా రైస్ మిల్లును మూసివేస్తామ‌ని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.

మరోపక్క ఇటీవలే కేసీఆర్.. ”వడ్ల కొనుగోలుపై చీఫ్ సెక్రటరీ తదితరులతో ఒక కమిటీ వేశాం. తక్కువ నష్టంతో ధాన్యం మొత్తం కొనుగోలు చస్తాం. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గోనె సంచులు వంటి సదుపాయాలన్నీ పౌర సరఫరాలశాఖ కల్పిస్తుంది. మూడు నాలుగు రోజుల్లో మొత్తం కొంటారు” అని ఆయన మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి రైస్ మిల్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు