సవాల్ ను స్వీకరించి భట్టి ఇంటికి వెళ్లిన మంత్రి తలసాని - MicTv.in - Telugu News
mictv telugu

సవాల్ ను స్వీకరించి భట్టి ఇంటికి వెళ్లిన మంత్రి తలసాని

September 17, 2020

ftkji

బుధవారం రోజున తెలంగాణ అసెంబ్లీలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ప్రసగింస్తున్నారు. ఈ సమయంలో భట్టి విక్రమార్క కలుగజేసుకుని అసలు తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నారా? దమ్ముంటే ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ సాక్షిగా స్వీకరించారు. నేను స్వయంగా మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తానని తలసాని సభలో భట్టికి తెలిపారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని భట్టి విక్రమార్క నివాసానికి మంత్రి తలసాని వెళ్లారు. 

ఆయన వెంట మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు. భట్టి నివాసంలో కాసేపు చర్చల తరువాత.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసేందుకు ఇద్దరు నేతలు ఒకే కారులో వెళ్లారు. మంత్రి తలసాని.. భట్టికి జియాగూడలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపించారు. భట్టి వెంట కాంగ్రెస్ నేతలు వీహెచ్, కేఎల్ఆర్, విక్రమ్ తదితరులు ఉన్నారు. జియాగూడతో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తైన డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లను భట్టి విక్రమార్కకు మంత్రి తలసాని చూపించనున్నారు. దీంతో ఇరువురు నేతలకు పోలీసులు భద్రత పెంచారు.