మహిళల కోసం హెల్ఫ్ లైన్ నం 181... - MicTv.in - Telugu News
mictv telugu

మహిళల కోసం హెల్ఫ్ లైన్ నం 181…

August 19, 2017

మహీళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ హెల్ఫ్ లైన్ నంబర్ ఏర్ఫాటు చేసింది. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 181 హెల్ప్ లైన్  నంబర్ ను ఈ రోజు సచివాలయంలో ప్రారంభించారు. గృహ హింస, వరకట్న వేధింపులు, పనిచేసే చోట వేధింపులు, మహిళల  సమస్యలపై  పరిష్కారానికి ఈ నంబర్ కృషి చేస్తుంది.

 

మహిళల కోసం షీ టీమ్ లు, హెల్ప్ లైన్లు వంటివాటిని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్ని ఏర్పాటు చేసినా కూడా సమాజంలో మార్పు  వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుంది.