ఏయ్ మంత్రీ.. ఆమె అడిగిందేంటి? నువ్వు వాగుతోంది ఏంటి? - MicTv.in - Telugu News
mictv telugu

ఏయ్ మంత్రీ.. ఆమె అడిగిందేంటి? నువ్వు వాగుతోంది ఏంటి?

March 16, 2018

ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలి. సమాధానం చెప్పడానికి ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి. ఇంకా గుచ్చిగుచ్చి అడిగితే సమాధానం లేదని చెప్పాలి. కానీ మన రాజకీయ నాయకులు హద్దు మీరుతున్నారు. ప్రశ్నలకు జవాబులు చెప్పలేక హద్దుమీరి వాగుతున్నారు. తమిళనాడు ఆరోగ్య మంత్రి సి.విజయ్ భాష్కర్ అలాంటోడే. అన్నాడీఎంకే సమావేశంలో ఏం జరిగిందో వెల్లడించండి అని తనను మర్యాదగా అడిగిన   అతడు నోరుపారేసుకున్నాడు.

‘నీ కళ్లద్దాలు అందంగా ఉన్నాయి.. నువ్వు చాలా అందంగా ఉన్నావు..’ అని నవ్వుతూ వెటకారమాడాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఓ టీవీ చానల్లో పనిచేస్తున్న మహిళా విలేకరి అక్కడికెళ్లారు. విజయ్ భాస్కర్‌ను ప్రశ్నించారు. అతడు జవాబు చెప్పలేదు.

‘నీ కళ్లజోడు బాగుంది.. చాలా బాగుంది..’ అని అన్నాడు. ఆమె పట్టించుకోకుండా మళ్లీ అడిగింది.. ‘నీ కళ్లజోడు బాగుంది..’ అని మళ్లీ అన్నాడు. అయినా ఆమె విసుక్కోకుండా..‘ఈ అద్దాలు రోజూ పెట్టుకుంటాను.. పార్టీ సమావేశంలో ఏం జరిగిందో చెప్పిండై’ అని వినయంగా ప్రశ్నించింది. అప్పటికి కూడా మంత్రి వెటకారం పోనిచ్చుకోకుండా.. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు.. ’ అని మూడుసార్లు అంటూ వెళ్లిపోయాడు.. ! అతనిపై పన్ను ఎగతవేత, అవినీతి కేసులు కూడా ఉన్నాయి.