కార్పొరేట్ ను తలదన్నే సర్కార్ దవాఖానా..
వారెవ్వా ఆసుపత్రి అదిరింది… కార్పొరేట్ ను మించిన వసతులు..అత్యాధునిక పరికరాలు… ఆపరేషన్ థియేటర్లు.. విశాలమైన గదులు..పరిశుభ్రమైన వాతావరణం…కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఈ సర్కారీ దవాఖానా కింద పనికిరావు…ఎందుకంటే అలా కట్టారు ఈ హాస్పిటల్. హై ఫై వసతులతో అదరగొట్టారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాతా శిశు వైద్యశాలను భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తో కలిసి ప్రారంభించారు. గ్రేట్ కానీ ఈ ఆసుపత్రి ఇలాగే మెయింటైన్ చేస్తారా..?
ఈ ఫోటోల్లో కనిపిస్తున్నది సంగారెడ్డిలోని సర్కార్ దవాఖానా.. మాతా శిశు వైద్యశాల.కార్పొరేట్ ను మించిపోయేలా తెలంగాణ సర్కార్ కట్టించింది. వైద్యం దశ-దిశ మారుతుందంటే ఇదేనేమో అని అనిపించే లెవల్లో ఉంది. ఈ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రులు హరీష్ , లక్ష్మారెడ్డిలు.. రూమ్ రూమ్ తిరిగి అన్ని విభాగాల్ని పరిశీలించారు.
తెలంగాణ వచ్చాక వైద్య రంగం దశ, దిశ మారుతుందని, ఇందుకు కృషి చేస్తున్న వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ని అభినందిస్తున్నానని మంత్రి హరీష్ రావు అన్నారు.మెతుకు జిల్లా పాత మెదక్ లో గతంలో వైద్యశాల లు దయనీయంగా ఉండేవని,ఇప్పుడా పరిస్థితి లేదని, అన్ని దవాఖానాలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు సంగారెడ్డిలో వెల్ నెస్ సెంటర్ ప్రారంభించనున్నామన్నారు.
.
స్పెషాలిటీ యూనిట్స్ ఏర్పాటుతో 15 విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారన్నారు.న్యూ బర్న్ బేబీస్ స్పెషాలిటీ NICU కేంద్రం కూడా సంగారెడ్డి లో ఏర్పాటైంది. నెలలు నిండకుండా పుట్టిన ప్రీ టర్మ్ బేబీస్ తల్లిదండ్రులకు మంచి అవకాశం. .అదే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రీ టర్మ్ బేబీలను ఉంచితే వేలల్లో బిల్లు వస్తుంది. ఎన్ ఐ సీయూ ఏర్పాటుతో సంగారెడ్డి జిల్లా వాసులకు ఆ కష్టాలు తగ్గాయి.
సంగారెడ్డి హాస్పిటల్లో 78 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి2,120 కేసీఆర్ కిట్లు ఒక్క సంగారెడ్డిలోనే పంపిణీ అయ్యాయి.ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే
400 కొత్త పడకలు తెలంగాణ వచ్చాకే వచ్చాయితెలంగాణలో కేసీఆర్ కిట్ల పథకం వచ్చిన తర్వాత 46 శాతం నుంచి 68శాతం ప్రసవాలు పెరిగాయి.90 శాతం వైఫ్యశాలల్లో, 5 శాతం అంబులెన్స్ లలో, 5 శాతం ఇళ్లల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. వందకు వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరగాలని సంకల్పించామని, వందకు వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లో జరిగే రాష్ట్రం దేశంలోనే మొదటిది తెలంగాణ అవుతుందని హరీష్ ధీమా వ్యక్తం చేశారు.
- కిడ్నీ బాధితులకు 40 డయాలిసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు
- దేశంలోనే ఎక్కడా లేని విధంగా సింగిల్ యూస్ డియాలేసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్ ఘనత
- పార్థివ వాహనం సంగారెడ్డి కి మంజూరు కావాలి.బొల్లారం లో హై రిస్క్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి
- నారాయణఖేడ్ లో హాస్పిటల్ ని UPGRADE చేసి తగిన సిబ్బందిని నియమించాలని " వైద్య మంత్రి లక్ష్మారెడ్డిని, హరీష్ రావు కోరారు.
ప్రభుత్వ ఆలోచనలకు నిలువుటద్దం సంగారెడ్డి మాతా శిశు వైద్యశాల అని లక్ష్మారెడ్డి అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో సంగారెడ్డి హాస్పిటల్ ని తీర్చిదిద్దామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునికరించామని,ప్రసవాలు ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
పలువురు బాలింతలకు కేసీఆర్ కిట్లను మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డి లు అందచేశారు. కిట్లు అందుకున్న బాలింతలు మాట్లాడుతూ, ఇప్పుడు సర్కార్ దవాఖానాలు బాగున్నాయన్నారు.పైసా ఖర్చు లేకుండా తమకు ప్రసవం చేశారని, పైగా డబ్బులు కూడా ఇస్తున్నారని చెప్పారు.మొత్తానికి సంగారెడ్డి కొత్త హాస్పిటల్ సూపర్..కార్పొరేట్ ఆసుపత్రిని మించి ఉంది. కానీ దీన్ని ఇంత నీట్ గా మొయింటైన్ చేస్తారా అనేదే డౌట్.