Ministers KTR and talasani paid tribute to Krishnamraju
mictv telugu

కృష్ణంరాజుకి నివాళులర్పించిన మంత్రులు కేటీఆర్, తలసాని

September 11, 2022

అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన నటుడు కృష్ణంరాజుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణంరాజు తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. బాధ సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలన్నారు. జీవించినంత కాలం అందరినీ కలుపుకొని వెళ్లారన్నారు. ప్రభుత్వ లాంఛనలో అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సైతం కృష్ణంరాజుకు నివాళులర్పించారు. ప్రముఖ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మురళీమోహన్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ పలువురు నివాళులర్పించారు.