కంగ్రాట్స్ కేటీఆర్..! అన్నది ఎవరో తెలుసా..? - MicTv.in - Telugu News
mictv telugu

కంగ్రాట్స్ కేటీఆర్..! అన్నది ఎవరో తెలుసా..?

June 17, 2017

మంత్రులు కేటీఆర్, హరీష్ రావు బావబామ్మర్ది.అంతకు మించి కేసీఆర్ కేబినెట్ లో ముఖ్యులు. కేసీఆర్ నెంబర్ వన్ అయితే..మరి నెంబర్ టూ ఎవరు..కేటీఆరా..హరీశా…?అందరిని తొలుస్తున్న ప్రశ్నే అయినా…ఎవరూ జవాబు చెప్పలేనిది. నిజంగా నెంబర్ 2 కోసం వీళ్లు పోటీ పడుతున్నారో లేదో తెలియదు కాదు… ఒక్క దాంట్లో మాత్రం కంపల్సరీగా పోటీపడుతున్నారు. ఇంతకీ ఆ ఒక్కటీ ఏంటీ..?

కేసీఆర్ కేబినెట్ లో ఎంతమంది మంత్రులున్నా…తెలంగాణ వాసుల నజర్ అంతా కేటీఆర్,హరీష్ రావుపైనే.ఈ ఒక్క రాష్ట్రమే కాదు దేశం దృష్టి కూడా వీళ్లపైనే. ఎందుకంటే వీరి మాటలు ,చేతలు అలాంటివి మరి. ఉరిమే ఉత్సాహంతో అభివృద్ధి పనుల్లో రాకెట్లాలా దూసుకుపోతారు. మైక్ పట్టారంటే మెరుపు మాటలతో మెస్మరైజ్ చేస్తారు. ప్రత్యర్థుల గుండెల్లో దడ పుటిస్తారు. టెక్నాలజీని వాడుకోవడంలోనైనా ఎవరికివారే సాటి. వాట్సాప్ గ్రూప్ ల్లో ఎవరికి వారే మేటి. నిత్యం అధికారులతో మాట్లాడుతూ మినిట్ టు మినిట్ అప్ డేట్ అవుతూ…పనుల్ని స్పీడప్ చేస్తుంటారు. ఈ విషయంలో ఒకరు ఎక్కువ..మరొకరు తక్కువ అని చెప్పలేం.

నిజానికి టీఆర్ఎస్ లో ఎప్పటినుంచో నెంబర్ టు పై ఎవరికి తోచినట్టు వారు చెప్పుకుంటారు. కొందరు కేటీఆర్ కు జై కొడితే ..మరికొందరు హరీష్ రావు కు ఓటేస్తారు. వీరి మధ్య విభేదాలున్నాయో లేవో గానీ.. కేసీఆర్ తర్వాత ఎవరు సీఎం అనే ఆలోచన జనంలో ఉంది. ఇప్పటికిది ఆప్రస్తుతమే అయినా వీరుమాత్రంఅభివృద్ధి లో పోటీపడిపడుతున్నారు. హెల్దీ అటాస్పియర్ లో నడుస్తున్నారు. పనుల విషయంలో ఒకరిని ఒకరు అభినందించుకుంటున్నారు. ఏమాత్రం భేషజాలకు పోకుండా కలిసి నడుస్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే… సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటుకు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్‌రావు మాట్లాడుతూ.. మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు కోసం కృషి చేసిన మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. మంత్రి కేటీఆర్ తెలంగాణను ఇండస్ట్రీయల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఎందరో ముందుకు వస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శ్రమ వల్ల కొత్త పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటుతో వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అంతే కాకుండా వైద్యం కూడా తక్కువ ధరలో అందుతుందన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలను కోరారు.

నిజంగా బావబామ్మర్ధి సూపర్…పదవులకోసం ..పరపతికోసం కాకుండా అభివృద్ధిలో పోటీపడటం..ఒకరిని ఒకరు అభినందించుకోవడం గ్రేట్. మరెందరికో స్ఫూర్తి..కిపిటప్ మినిష్టర్స్…