గెస్ట్ లెక్చరర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

గెస్ట్ లెక్చరర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

June 10, 2022

గెస్ట్ లెక్చలర్లకు తెలంగాణ సర్కార్(Telangana) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్ల పారితోషికాన్ని పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో పీరియడ్‌కు రూ. 300 చొప్పున పారితోషికాన్ని ఇస్తుండగా, తాజాగా పీరియడ్‌కు రూ. 390కి పెంచూతూ జీవో విడుదల చేసింది. వీరు నెలకు 72 గంటల పాటు పనిచేసేలా, పారితోషికం రూ. 28,080 మించరాదని సీలింగ్‌ విధించారు. ఈ మేరకు గురువారం ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ జీవో – 1105ని విడుదల చేశారు. దీంతో 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న రెండు వేల మంది గెస్ట్‌ లెక్చరర్లకు ప్రయోజనకం కలగనుంది.ఈ నిర్ణయంతో సర్కార్ ఖజానాపై కొంత ఆర్థిక భారం పడనుంది. అయితే ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.