రైతుల రుణమాఫీ బిల్లులను తిరస్కరించిన ఆర్థికశాఖ - MicTv.in - Telugu News
mictv telugu

రైతుల రుణమాఫీ బిల్లులను తిరస్కరించిన ఆర్థికశాఖ

April 12, 2022

05

రైతు రుణమాఫీ బిల్లులను ఆర్ధిక శాఖ తిరస్కరించింది. ఖజానాలో నిధులలేమి దీనికి కారణంగా తెలుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందుకనుగుణంగా వ్వవసాయ శాఖ బిల్లులను తయారు చేసి ఆర్ధిక శాఖకు పంపింది. రూ. 37 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉన్న రైతు రుణ బకాయిలు రూ. 857 కోట్లుగా ఉంది. అయితే, ప్రభుత్వం రుణమాఫీకి నిధులను నిర్దిష్టంగా ఇవ్వనందునే బిల్లులు మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. కాగా, గతేడాది రూ. 50 వేల వరకు, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 75 వేల వరకు ఉన్న రుణమాఫీ బకాయిలను మాఫీ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. కానీ, ఆచరణలో మాత్రం ఎలాంటి చర్యలు కనపడడం లేదు. అటు రైతులు మూడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 763 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మొత్తం లక్ష లోపు రుణమాఫీకి దాదాపు రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయి. ఇంకా ఏడాదిన్నర మాత్రమే ఎన్నికలకు గడువుండడంతో ప్రభుత్వం ఏం చేస్తుందనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.