జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు..? - MicTv.in - Telugu News
mictv telugu

జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు..?

June 3, 2022

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరానికి చెందిన బాలిక(17) గత శనివారం (గత నెల 28న) జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లోని అమినీషియా పబ్‌లో జరిగిన పార్టీకి వెళ్లింది. కొద్దిసేపు ఉండి పబ్‌ నుంచి బయటకు వచ్చింది. స్నేహితులతో కలసి రోడ్లపై తిరిగింది. ఇంటికి వెళ్లిన బాలిక మెడపై గాట్లు ఉండడం గమనించిన తండ్రి.. ఆమెతో ఉన్న యువకులు అసభ్యంగా ప్రవర్తించారని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే సూరజ్‌, హదీతోపాటు మరికొంతమందిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక పబ్‌ నుంచి బయటకు రాగానే కొందరు యువకులు ఆమెను బెంజ్‌ కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 14లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లడం.. కొద్ది సేపటి తరువాత ఇన్నోవా కారులో పబ్‌కు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఆమె వెళ్తున్న బెంజ్‌ కారులో పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది.