యూట్యూబ్‌ చూసి బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. ఆ బిడ్డను ఏం చేసిందంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

యూట్యూబ్‌ చూసి బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. ఆ బిడ్డను ఏం చేసిందంటే..

October 18, 2022

మహారాష్ట్ర పుణెలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొండ్వాలోని ధ్వాడేకు చెందిన ఓ బాలిక యూట్యూబ్లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ శిశువును కిటీకీలో నుంచి బయటకు విసిరేసింది. దీనిపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై మహిళా కమీషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండగా.. ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లింది.

బాలికను పరీక్షించిన డాక్టర్ గర్భవతి కావచ్చేమో అని అనుమానించి.. సోనోగ్రఫీ పరీక్ష చేయించాలని సూచించారు. డాక్టర్లు సూచించినా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇంటికి వెళ్లారు. ఇదిలా ఉండగా.. వారు నివసిస్తున్న ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఓ నవజాత శిశువు స్థానికులకు కనిపించింది. అదే రోజు రాత్రి బాలిక ఆస్పత్రిలో కనిపించింది. దీంతో అనుమానం వచ్చి బాలికను ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాన్ని వెల్లడించింది. తానే యూట్యూబ్లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చానని.. తరువాత బిడ్డను కిటికీ నుంచి కిందకు విసిరేసినట్లు చెప్పింది.