బాలికపై అత్యాచారం.. కాళ్లు, చేతులు కట్టేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

బాలికపై అత్యాచారం.. కాళ్లు, చేతులు కట్టేసి..

September 10, 2020

Minor Girl Victim In Noida

దేశంలో మహిళలపై లైంగిక దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. అన్ని చర్యలు తీసుకున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా యూపీలోనూ ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై ఓ యువకుడు అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. కాళ్లు, చేతులు కట్టేసి లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత గదిలో బందించి పారిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరిన ఆ బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.  

గ్రేటర్ నోయిడాలోని బిస్రాక్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్‌లో 13 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లిపోయిన సమయంలో పక్కనే ఉన్న ఓ యువకుడు ఆమెను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లాడు. అక్కడ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి.. తన ఫ్లాట్‌కు తాళం వేసి పారిపోయాడు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు కోసం వెతకగా ఆచూకీ లభించలేదు. పోలీసులు వచ్చి తాళం వేసి ఉన్న ఆ ఫ్లాట్ తెరిచి చూడగా..  ఆమె అపస్మారక స్థితిలో ఉంది. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.