కూతురికి ప్రవసం చేసి మర్నాడు పెళ్లి చేసిన మహాతల్లి!
కూతురు తప్పు చేస్తే మందలించి దారిలో పెట్టాల్సిన తల్లి.. కూతురు ప్రేమాయణం నడిపి గర్భం తెచ్చుకునేదాకా గుర్తించలేదు. తీరా గుర్తించాక, అబార్షన్ కుదరదని తేలడంతో కూతురికి స్వయంగా పురుడు పోసి పుట్టిన బిడ్డను కర్కషంగా మురికి కాలువలో పడేసింది. అంతేకాక, ఆ మర్నాడే కూతురికి వివాహ సంబంధం తెచ్చి పెళ్లి చేయబోయింది. ఇది సీసీ కెమెరాలో రికార్డవడంతో పోలీసులు ఎంటరయి వారిని అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇజ్జత్ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికకు వరుసకు బావయ్యే వ్యక్తితో పరిచయమయ్యింది. అది పెరిగి ప్రేమగా మారడంతో ఓ రోజు ఆ వ్యక్తి బాలిక ఇంటికి వచ్చి కొద్ది రోజులు ఉండి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో విషయం ఇంట్లో తెలిసి బాలికకు మరో వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే బాలిక గర్భవతి అని తెలియడంతో అబ్బాయి తరపువారు నిరాకరించారు. పుట్టే శిశువును వదిలేస్తే పెళ్లికి ఓకే అని షరతు పెట్టారు. దాంతో బాలిక ప్రసవించేవరకు ఆగి, బిడ్డ పుట్టగానే దానిని తీసుకెళ్లి మురికికాలువలో పడేసింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయిన విషయం వారికి తెలియదు. ఆ మరుసటి రోజు బాలికకు రహస్యంగా పెళ్లి జరిపించింది. విషయం తెలిసిన పోలీసులు శిశువును రక్షించి బాలిక తల్లి, బాలికను చేసుకున్న వరుడిపై కేసు నమోదు చేశారు. శిశువును బాలికకు అప్పగించేశారు.