Minor raped by factory manager, acid poured into her mouth; NCW shoots off letter to Delhi Police
mictv telugu

మైనర్ బాలికపై రేప్.. ఎవరికైనా చెబుతుందేమోనని యాసిడ్ తాగించాడు..

July 17, 2022

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఓ దుర్మార్గుడు.. ఆపై బలంవంతంగా బాలిక నోట్లో యాసిడ్ పోసిన ఘటన సంచలనంగా మారింది. మైనర్‌పై అత్యాచారం చేసి, తన గురించి ఎవరికి చెప్పకుండా ఉండటానికి ఆమె నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో బాధితురాలి పరిస్థితి విషమంగా మారింది. బాలిక పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమెను హుటాహటిన ఆసుత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆదేశించింది. బాధితురాలి వాంగ్మూలం తక్షణమే తీసుకుని మెజిస్ట్రేట్‌కు అందించాలని సూచించింది.

బాధితురాలి కుటుంబం రోజువారీ కూలీ చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే షూ పరిశ్రమలో పనిచేసేందుకు బాధితురాలు వెళ్లింది. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి నమ్మించిన మేనేజర్ జై ప్రకాశ్.. ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా బలవంతంగా నోట్లో యాసిడ్ పోశాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాధితురాలు.. అపస్మారక స్థితిలోకి చేరుకుంది. దీంతో బాధితురాలిని ఎయిమ్స్‌కు తరలించారు. బాధితురాలికి చికిత్స జరుగుతోందని తెలిపారు.