పిల్లలపై పైశాచికం.. కొట్టి, నగ్నంగా ఊరేగించి.. - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లలపై పైశాచికం.. కొట్టి, నగ్నంగా ఊరేగించి..

March 22, 2018

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఘోరంగా విఫలమవుతున్నాయి. మహానగరాల నుంచి మారుమూల పల్లెల వరకు చిట్టిచిట్టి చేతులు కష్టపడుతూనే ఉన్నాయి. రాజస్తాన్ లో ముగ్గురు మైనర్లు కొందరు దుర్మార్గులు చిత్రహింసలు పెట్టారు. పొద్దుతిరుగుడు పొలంలో పనులు చేయడానికి నిరాకరించినందుకు బట్టలు విప్పి, కొట్టి, 2.5 కిలోమీటర్ల దూరం నడిపించారు. ఎర్రటి ఎండలో పిల్లలు కాళ్లు కాలిపోతూ అల్లాడుతున్నా కనికరించకుండా పైశాచికంగ వ్యవహరించారు.బికనీర్ జిల్లా మోతావా గ్రామంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. గణేశ్ సింగ్ అనే భూస్వామి.. ఈ పిల్లలను హింసించినట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా ఈ పాపకార్యాన్ని వీడియో కూడా తీశాంచాడా ధూర్తుడు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ‘మేం మా పొలానికి పోతుడంగా గణేశ్ అడ్డుకున్నాడు. తన పొలంలో పనిచేయాలని బెదరించాడు. మా పనులు మాకు ఉన్నాయని చెప్పాం. దీంతో అతడు మా బట్టలు విప్పేసి కొట్టాడు.. ’ అని బాధితుడు చెప్పాడు.