Minors crash car onto people in Tenali, three critically injured
mictv telugu

తెనాలిలో మైనర్ల దారుణం.. జనంపై కారు నడిపి…

July 6, 2022

Minors crash car onto people in Tenali, three critically injured

గుంటూరు జిల్లా తెనాలిలో కారు బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌లో ఉన్న కారు అదుపు తప్పి.. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్‌ రోడ్డులో రిక్షా మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. మైనర్లు కారు నడపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఓ వ్యక్తి కాలు నుజ్జునుజ్జవగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డ్రైవింగ్‌ చేసిన మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను తెనాలి పట్టణంలోని ఐతానగర్ కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.