రూ. 40 చోరీ.. ఏడేళ్ల జైలుశిక్ష పడుతుందట! - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 40 చోరీ.. ఏడేళ్ల జైలుశిక్ష పడుతుందట!

July 29, 2020

Mint staff faces 7 years in jail for stealing Rs 40

ఎవరైనా రూ. 40 దొంగిలిస్తే మందలించి వదిలేస్తారు. అంతే గానీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి జైలు శిక్ష వేయించారు. కానీ,   ముంబైలో ఉన్న భారత ప్రభుత్వ మింట్ విభాగంలో పనిచేస్తున్న చాబుక్స్వర్ అనే ఉద్యోగికి రూ. 40 దొంగలించినందుకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడనుందని తెలుస్తోంది. చాబుక్స్వర్ మింట్ లో పనిచేస్తున్నాడు. అక్కడ ముద్రణ జరుగుతున్న రెండు కొత్త రూ.20 నాణెలను దొంగిలించి తన లాకర్ లో దాచుకున్నాడు. 

ఈ విషయం సెంట్రల్ ఇండ్రస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కి తెలిసంది. దీంతో మింట్ అధికారుల సమక్షంలో అతడి లాకర్ తెరచి అందులో ఉన్న నాణాలను జప్తు చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అతడిని అదుపులోకి తీసుకోలేదు. చాబుక్స్వర్ రూ.20 నాణెలను ఎందుకు దాచుకున్నాడనే దానిపై విచారణ జరుపుతున్నారు. అతడికి దాదాపు 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని అధికారులు భావిస్తున్నారు. రూ.20 నాణెం ఇంకా చెలామణిలోకి రావాల్సి ఉంది. ఏప్రిల్ లోనే చలామణిలోకి రావాల్సిన ఈ నాణం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలస్యం అవుతోందని మింట్ అధికారులు తెలిపారు.