Mirch powder abhisheka in Elur saint ashram Andhra Pradesh
mictv telugu

కారం పొడితో అభిషేకం.. ఏపీ స్వామీజీ వెరైటీ

November 14, 2022

Mirch powder abhisheka in Elur saint ashram Andhra Pradesh

పాలాభిషేకం తెలుసు, నెయ్యభిషేకం, పుష్పాభిషేకం తెలుసు. మరెన్నో అభిషేకాలు తెలుసు. కానీ కారంపొడితో అభిషేకం తెలుసా? అదికూడా మాంచి గొడ్డుకారం పొడితో అభిషేకం! కారం పొడి ఘాటు తగిలితేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఓ స్వామీజీ 50 కేజీల కారంపొడితో అభిషేకం చేయించుకున్నాడు. ఇది ఎప్పుడూ జరిగే తంతేనట. ఏపీలోని ఏలూరు జిల్లాలో ఓ ఆశ్రమం ఈ వింతకు వేదిక.

దొరసానిపాడు గ్రామంలో శివదత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమాన్ని నడిపే శివస్వామీజీ ఇలాంటి విశిష్ట పూజలు చేస్తున్నారు. శివస్వామి ప్రత్యంగిర దేవతను ఆవాహన చేసిన తర్వాత భక్తాదులు ఆయనపై కారం పొడి చల్లారు. అంత ఘాటుగా ఉన్నా స్వామీజీ ఏమాత్రం కదలకుండా నిష్టగా ధ్యానం చేశారు. చెప్పుకోడానికి వింతగా ఉన్న ఈ కారాభిషేకం వెనక పెద్ద చరిత్రే ఉందంటున్నారు. కొన్ని కథనాల ప్రకారం హిరణ్యకశిపుడిని నరసింహస్వామి చంపాక ఆయనను శాంతింపచేయడానికి ప్రత్యంగిరా దేవి అవతరిస్తుంది. ఆమెకు జరిపే పూజల్లో కారాలు, మిరియాలు వంటి ఘాటు పదార్థాలు ఉండాలి. ఆ ఘాటు కారణంగా భక్తులను పట్టిపీడించే దెయ్యాలు, భూతాలు పారిపోతాయి. ఇలాంటి కరాభిషేకాలు చేయించుకునే స్వామీజీలు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ స్వామీజీ 75 కేజీల కారం పొడిని నీటిలో కలిపి అభిషేకం చేయించుకుంటుంటారు.