తండ్రి ఆస్తిలో చిల్లిగవ్వ అక్కర్లేదు: అమృత - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి ఆస్తిలో చిల్లిగవ్వ అక్కర్లేదు: అమృత

June 13, 2019

 

.Army veteran released from detention center in Guwahati.........తన ఆస్తి తన కష్టార్జితమని, అందులో తన కూతురు అమృత వర్షిణికి చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటూ మిర్యాలగూడ వ్యాపారి తిరునగరి మారుతిరావు వీలునామా రాసినట్లు పోలీసులు చార్జిషీటులో తెలిపారు. ప్రయణ్ హత్య కేసులో నల్గొండ జిల్లా కోర్టుకు 1600 పేజీలతో దీన్ని అందజేశారు. దీనిపై ప్రణయ్ భార్య అమృత వర్షిణి స్పందించారు. తన భర్తను చంపిన తన తండ్రికి కఠిన శిక్ష పడాలని, అతని ఆస్తిలో తనకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదని ఆమె స్పష్టం చేశారు.

‘నా భర్తనే చంపేశారు. నాకు డబ్బులపై ఆశలేదు. నా తండ్రి డబ్బు కోసం నేను ఆశపడడం లేదు. అతనికి శిక్ష పడితేనే ప్రయణ్ ఆత్మ శాంతిస్తుంది. నేను ఇంట్లోంచి వచ్చేటప్పుడు బట్టలు కూడా వదిలేసి వెళ్లమని నా తండ్రి చెప్పాడు. అతని ఆస్తి నేను ఆశించను. ప్రయణ్‌ని చంపిన వాళ్లకు శిక్ష పడాలనన్నదే నా కోరిక’ అని ఆమె అన్నారు. అమృత.. దళితుడైన ప్రయణ్‌ని ప్రేమించి పెళ్లిచేసుకోవడం ఇష్టం లేని మారుతిరావు కిరాయిగూండాలతో అల్లుడిని చంపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు బెయిలుపై బయటికి వచ్చాడు.