సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో నల్లగొండ ఎస్పీ రంగనాథ్తో వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కేసులో నిందితులగా ఉన్న వారి నేరచరిత్రను బయటకు తీసేందుకు పీడీయాక్ట్ మోపాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ప్రణయ్ భార్య అమృతకు సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులు, ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతుందని చెప్పిన జంటపై స్టీపెన్ రవీంద్ర ఆరా తీశారు.అమృతను బెదిరించిన వారి ఖాతాల వివరాలు తెలుసుకోవడంతో పాటు హంతకులతో వారికేమైనా సంబంధం ఉందా? వారు ఎక్కడి వారు? ఎందుకిలా చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేయాలని ఐజీని ఆదేశించారు. తనతో పాటు అత్తామామలకు ప్రాణహానీ ఉందని రక్షణ కల్పించాలని అమృత పోలీసులను ఆశ్రయించడంతో సాయుధ సిబ్బందితో పాటు ఇద్దరు మహిళా పోలీసుల్నినియమించిన విషయం తెలిసిందే.. భద్రత వ్యవహారాలపై నిఘా విభాగం అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారరని పోలీసులు పేర్కొంటున్నారు.