'మీర్జాపూర్‌ 2'ను బ్యాన్ చేయాలని పీఎంకు మహిళా ఎంపీ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

‘మీర్జాపూర్‌ 2’ను బ్యాన్ చేయాలని పీఎంకు మహిళా ఎంపీ లేఖ

October 25, 2020

Mirzapur MP seeks ban on Amazon Prime's 'Mirzapur 2'

ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన‌‌ ‘మీర్జాపూర్‌ 2’ అనే వెబ్ సిరీస్‌ను నిషేధించాలని‌ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ అప్నా దల్‌ ఎంపీ అనుప్రియా పాటేల్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆమె ఆమె దేశ ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌లకు లేఖలు రాసారు. మీర్జాపూర్ వెబ్‌ సిరీస్‌‌ జాతి అసమానతలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. అలాగే ఈ వెబ్ సిరీస్‌లో మీర్జాపూర్ పట్టణాన్ని ఓ హింసాత్మక ప్రదేశంగా చూపిస్తూ దాని పేరు చెడగొడుతోందని మండిపడ్డారు. దీంతో ఈ వెబ్‌ సిరీస్‌ గురించి విచారణ జరిపి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. 2018లో వచ్చిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ కు సీక్వెల్‌గా ఈ సిరీస్ వచ్చింది. ఇందులో పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు శర్మ, హర్షితా శేఖర్‌, శ్వేత త్రిపాఠి, అమిత్‌ సియాల్‌, విజయ్‌ వర్మ, ఇషా తల్వార్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు గుర్మీత్‌ సింగ్, కరణ్‌ అన్షుమన్‌లు దర్శకత్వం వహించారు. ఎక్సెల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రితేశ్‌ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ దీన్ని సంయుక్తంగా నిర్మించారు.