మెదక్ జిల్లలో ఘోరం జరిగిపోయింది. ఓ వ్యక్తిని కారులో ఉంచి నిప్పుపెట్టి సజీవ దహనం చేశారు దుండగులు. టేక్మాల్ మండలం వెంకటాపూర్ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సమాచారం ప్రకారం.. అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కాగా, చనిపోయిన వ్యక్తి ఒక కాలు కారు డోరు నుంచి బయటపడి ఉంది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వ్యక్తిని గిరిజనుడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. వ్యక్తిని బలవంతంగా కారు ఎక్కించి పెట్రోల్ పోసి నిప్పంటించారు. కారు నెంబరును దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. కారు వద్ద బ్యాగుతో పాటు చెట్ల పొదల్లో పెట్రోల్ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎవరు చంపారు? హత్యకు కారణాలేంటి? అనే కోణంలో విచారిస్తున్నారు.