శంకరాచార్యుల విగ్రహంపై మసీదు బట్ట.. శృంగేరిలో టెన్షన్  - MicTv.in - Telugu News
mictv telugu

శంకరాచార్యుల విగ్రహంపై మసీదు బట్ట.. శృంగేరిలో టెన్షన్ 

August 14, 2020

Miscreants throw SDPI flag on Shankaracharya statue in Sringeri, devotees stage protest.

సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ వల్ల అట్టుడుకున్న కర్ణాటకలో మరో దారుణం వెలుగు చూసింది. చిక్‌మగళూరు జిల్లా శృంగేరి పట్టణంలో ఆదిశంకరాచార్యుల విగ్రహంపై ఓ తాగుబోతు  మసీదు బొమ్మ ముద్రించిన బట్ట వేశాడు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) జెండాను పోలిన జెండాపై మసీదు బొమ్మను అచ్చేసి ఉన్న ఆ బట్టను  విగ్రహం మండంపై పడేశాడు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. 

మాజీ ఎమ్మెల్యే డీణ్ జీవరాజ్ నేతృత్వంలో కొందరు స్థానికులు నిరసనకు దిగారు. పోలీసులు హుటాహుటి రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మిలింద్ అనే 28 ఏళ్ల యువకుడు ఆ జెండాను ఉంచినట్లు సీసీటీవీ పుటేజ్ ద్వారా తెలిసింది. మలింద్ మద్యానికి బానిసని, అతనికి ఏ పార్టీతోనూ సంబంధం లేదని పోలీసులు చెప్పారు. ‘అది ఎస్డీపీఐ జెండా కాదు. మిలాడ్నబీ పండగ కోసం ముద్రించిన బ్యానర్. చలిగా ఉండడంతో మిలింద్ దాన్ని తీసుకున్నాడు. అయితే అది సురక్షితంగా ఉండాలని అక్కడ పెట్టారు. ఇది వెర్రిపని తప్ప మరొకటి కాదు’ అని చెప్పారు. బెంగళూరులో జరిగిన అల్లర్ల వెనక ఎస్డీపీఐ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి.