ఈ మెరుపు తీగ..మిస్ ఇండియా ఎలా అయిoదంటే... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ మెరుపు తీగ..మిస్ ఇండియా ఎలా అయిoదంటే…

June 26, 2017

మిస్‌ ఇండియా 2017గా హర్యానా కు చెందిన మానుషి ఛిల్లార్‌ ఎంపికైంది. తొలి రన్నరప్‌గా జమ్ముకశ్మీర్‌కు చెందిన సనా దువా, రెండో రన్నరప్‌గా బిహార్‌కు చెందిన ప్రియాంక కుమారి నిలిచారు.54వ ఫెమినా మిస్‌ ఇండియా పోటీలు ఆదివారం రాత్రి ముంబయిలో ఘనంగా జరిగాయి.

యశ్‌రాజ్‌ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన బాలీవుడ్‌ ప్రముఖులు రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌జోహార్‌ లు విజేతను ప్రకటించారు. ఈ పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. మిస్‌ ఇండియా ఫైనల్లో భారతీయ సంప్రదాయానికి చెందిన డ్రెస్సుల్ని ధరించారు. ఈ పోటీలకు మిస్‌ వరల్డ్‌ 2016 స్టిఫానీ డెల్‌ వాలే న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. మిస్ ఇండియా మానుషి.. ఢిల్లీలోని సెయింట్‌ థామస్‌ స్కూల్లో చదివింది. మానుషి తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. తాను కూడా వైద్య విద్యే చదువుతోంది.