Miss India 2023 competition notification release
mictv telugu

మిస్ ఇండియా పోటీలకు ఆహ్వానం.. దరఖాస్తుకు అర్హతలివే

December 6, 2022

అందాల పోటీలంటే మగువలు అమితాసక్తిని ప్రదర్శిస్తారు. ముఖ్యంగా ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన అమ్మాయిల కోసం సినీ ఇండస్ట్రీ వరుస అవకాశాలు కల్పించడానికి రెడీగా ఉంటుంది. భారత దేశంలో గత ఆరు దశబ్దాలుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. తాజాగా 59వ మిస్ ఇండియా – 2023 పోటీలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వీటికోసం యువతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ పోటీలకు ఫెమీనా భాగస్వామిగా నిలుస్తోంది. దీంతో ఈ పోటీలు ఫెమీనా పేరు మీదే చలామణి అవుతున్నాయి. మణిపూర్ లో జరిగే ఈ పోటీలకు దేశంలోని కశ్మీర్ సహా అన్ని ప్రాంతాల నుంచి అందాల భామలకు అవకాశం ఉంటుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీలు నిర్వహించి 30 మందిని సెలెక్ట్ చేస్తారు. వారిలో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. కాగా, ఈ పోటీలో పాల్గొనేందుకు కొన్ని అర్హతలు కావాల్సి ఉంటుంది. అవేంటంటే..
1. భారత దేశ పౌరులై ఉండాలి.
2. వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
3. బరువు 51 కిలోలు మించకూడదు.
4. పెళ్లి చేసుకొని ఉండకూడదు. కనీసం నిశ్చితార్ధం కూడా అయి ఉండకూడదు. గతంలో పెళ్లి చేసుకుంటే అనర్హులవుతారు.
5. ఎత్తు హీల్స్ లేకుండా కనీసం 5.3 అడుగులు ఉండాలి.
6. భారత పాస్ పోర్టు కలిగి ఉండాలి. ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా కార్డు ఉన్న వారు రన్నరప్ కోసం మాత్రమే అర్హులవుతారు.
7. అర్హత, ఆసక్తి ఉన్నవారు www.missindia.com వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.