Miss universe, R’Bonney Gabriel, facts, salary, cash prize, winner,
mictv telugu

మిస్ యూనివర్స్ 2022 ఆర్ బోని గాబ్రియేల్!

January 16, 2023

Miss universe, R’Bonney Gabriel, facts, salary, cash prize, winner,

యూఎస్ లోని న్యూఓర్లీన్స్ లో జరిగిన 71వ మిస్ యూనివర్స్ బ్యూటీ పోటీలో మిస్ యూఎస్ఏ ఆర్ బోని గాబ్రియేల్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమె పర్యావరణ అనుకూల ఫ్యాషన్ డిజైనర్ గా పేరు కాంచింది. ఈమె ఒక మోడల్, కుట్టు శిక్షకురాలు. ఈమె గురించి ఒక ఐదు విషయాలు.. అంతేకాదు ఆమె గెలుచుకున్న ప్రైజ్ మనీ విషయాలు మీకోసం..

1. ఆర్ బోనీ గాబ్రియేల్ మార్చి 20, 1994న టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జన్మించింది. గాబ్రియేల్ హై స్కూల్ లెవల్ లో వాలీబాల్ ప్లేయర్.

2. మిస్ యూనివర్స్ అధికార వెబ్ సైట్ ప్రకారం.. ఆమె 15 సంవత్సరాల వయసులో ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టారు. మెటీరియల్స్, టెక్స్ టైల్స్ ఉపయోగించి డిజైన్ లను రూపొందించడం చేసింది.

3. 2018 లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచి ఫ్యాషన్ డిజైన్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లోనే కాదు.. ఫైబర్స్ లో మైనర్ లో కూడా పట్టభద్రురాలైంది. ఆమె తన స్వంత పర్యావరణ అనుకూలమైన దుస్తులను రూపొందించడం ప్రారంభించింది.

4. మిస్ యూనివర్స్ పోటీని గెలుచుకున్న మొదటి ఫిలిపినో అమెరికన్ మన గాబ్రియేల్.

5. మిస్ యూనివర్స్ పోటీలో.. ‘మనలో ఒక యూనిక్ ప్రతిభ ఉంటుంది. దీంతో మనం సంఘంలో మార్పు తీసుకురావడం చాలా ముఖ్యం. మనందరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని మనం సరిగా గుర్తించాలి. జీవితం అనే విత్తనం నాటినప్పుడు వాటిని ఆసరాగా చేసుకొని మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి’ అంటూ సమాధానమిచ్చింది ఈ అందాల రాశి.

ప్రైజ్ మనీ గురించి..
మిస్ యూనివర్స్ 2022 పోటీ విజేతకు అందించే మొదటి ప్రధానమైనది బెజ్వెల్డ్ కిరీటం. ఇది వజ్రాలు, నీలమణులతో పొదగబడింది. దీంట్లో మొత్తం 993 రాళ్లు పొదగబడి ఉన్నాయి. దీని ధర 5.5 మిలియన్ యూఎస్ డాలర్లు. ఫోర్స్ ఫర్ గుడ్ కిరీటం కాకుండా.. ఈ సంవత్సరం మొత్తానికి ఆమెకు 2, 50, 000 డాలర్లు ఇవ్వబడుతాయి. ఇవికాకుండా.. న్యూయార్క్ లో లగ్జరీ అపార్ట్మెంట్ ఇస్తారు. అనేక ప్రచార కార్యక్రమాలకు, వినోద కార్యక్రమాలకు వెళ్లేందుకు ఆమెకు ఫ్రీ ఎంట్రీ. అంతేనా.. ప్రపంచాన్ని ఉచితంగా చుట్టి వచ్చే అవకాశం ఆమెకు లభిస్తుంది. సహాయ కార్యక్రమాల కోసం చాలాసార్లు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లవచ్చు. రవాణాతో సహా ఆమె అన్ని ఖర్చులను కూడా సంస్థ చూసుకుంటుంది. ఆమె అగ్రశ్రేణి ఫ్యాషన్ బ్రాండ్స్, మేకప్ ఆరిస్టులు, విలాసవంతమైన వసతిని కూడా ఉచితంగా పొందుతుంది.