మిస్ యూనివర్స్ పోటీలు ప్రిలిమినరీ పోటీ జరిగింది. దీంట్లో థాయ్ బ్యూటీ అన్నా సుయాంగమ్ డ్రింక్ క్యాన్ ల ఫుల్ ట్యాబ్ లతో తయారు చేసిన గౌనును ధరించింది.
అందాల పోటీలకు కొత్తగా ఉండాలని అనుకుంటారు. పైగా దానికి ఒక అర్థం కూడా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈసారి జరిగిన పోటీల్లో థాయ్ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు.. అందరి మనసులను దోచింది. ఇప్పుడు ఆమె ధరించిన గౌన్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
మిస్ యూనివర్స్ 2022 ప్రిలిమినరీ పోటీలో అన్నా సుయంగమ్ ఐయామ్ సోడా డ్రింక్ క్యానన్ల ఫుల్ ట్యాబ్ లతో చేసిన రీసైకిల్ డ్రెస్ ధరించింది. వీటి మధ్యలో స్వరోవ్స్సీ వజ్రాలతో కూడా అలంకరించబడింది. ఈ రీసైకిల్ డ్రెస్ ధరించడానికి కారణం.. ఆమె తండ్రి చెత్త సేకరించే వ్యక్తి, ఆమె తల్లి వీధి ఊడ్చేది. అందుకే గౌను అలా డిజైన్ చేయించింది. ఈ డ్రెస్ కి ‘గార్బేజ్ బ్యూటీ క్వీన్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ డ్రెస్ ని మణిరత్ అనే ఫ్యాషన్ బ్రాండ్ ‘హిడెన్ ప్రెషియస్ డైమండ్ డ్రెస్’ గా అభివర్ణించింది.
‘మీరు జన్మించిన అస్పష్టమైన పరిసరాలతో మీరు చిక్కుకోడదు, కానీ మీ స్వంత జీవితాన్ని మంచిగా మార్చుకునే శక్తి మీకు ఉందని నమ్మండి’ అంటూ అన్నా సోషల్ మీడియాలో రాసింది. చాలామంది.. ఆమె విలువైన రత్నం వలె ప్రకాశవంతంగా ప్రకాశించకుండా ఎవ్వరూ ఆపలేరు అంటూ రాశారు. మరికొంతమంది.. ‘మిస్ థాయ్ లాండ్ గెలువాలి, వారి తల్లిదండ్రులకు నివాళిగా ఆమె వేసుకున్న డ్రెస్ ఉండడం మాకు ఎంతో నచ్చింది అని, ‘థాయ్ బ్యూటీ క్వీన్ లకు వారి దుస్తులను ఎలా డిజైన్ చేసుకోవాలో బాగా తెలుసు’ అంటూ కామెంటారు. ఇప్పుడు థాయ్ బ్యూటీ డ్రెస్ నెట్టింట తెగ హాట్ టాపిక్ గా నడుస్తున్నది. అందరి మనసులు దోచుకున్న ఆ డ్రెస్ పై మీరూ ఓ లుక్కేయండి.