మిస్ వరల్డ్ రేసులో తెలంగాణ అమ్మాయి - MicTv.in - Telugu News
mictv telugu

మిస్ వరల్డ్ రేసులో తెలంగాణ అమ్మాయి

June 30, 2017

మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి తెలంగాణ అమ్మాయి చేరింది. మద్దతు తెలుపాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. జులైలో జరిగే మిస్ వరల్డ్ అందాల పోటీల్లో ఫైనలిస్టు విభాగంలో పాల్గొనే కల్యాణపు శ్రావ్య ది ఖమ్మం జిల్లా అశ్వారావుపేట. ఆమె తండ్రి కల్యాణపు రవికుమార్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 2002 నుంచి 2005 వరకు ఏవోగా పనిచేశారు.

శ్రావ్య ఏడో తరగతి వరకు ఆదిలాబాద్‌లో చదువుకుంది. ఆమె ప్రస్తుతం యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రాలో కెమికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుంది. ప్రస్తుతం మిస్ నార్థ న్ అల్‌బర్‌టా వరల్డ్ టైటిల్ ను శ్రావ్య సొంతం చేసుకుంది. తెలంగాణ అమ్మాయి శ్రావ్య ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో మద్దతు తెలుపాలని పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. మీరూ సోపోర్ట్ చేయడం మర్చిపోవద్దు.