Home > Featured > కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష సక్సెస్..

కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష సక్సెస్..

Missile Test Success in Kurnool District

కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఓర్వకల్లు వద్ద డీఆర్‌డీవో నిర్వహించిన క్షిపణి పరీక్షను ఆర్మీ సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది. బుధవారం సాయంత్రం 4గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం చేయడానికి ప్రత్యేక బృందం ఢిల్లీ నుంచి వచ్చింది. తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌ను డీఆర్‌డీవో పరీక్షించింది.

రెండున్నర కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మిస్సైల్‌ ఛేదించింది.ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా డీఆర్‌డీవో ఈ క్షిపణిని రూపొందించింది. అనుకున్న సమయం ప్రకారం ఇది లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు పేర్కొన్నారు. థర్డ్‌ జనరేషన్‌ క్షిపణిగా డీఆర్‌డీవో పేర్కొంది. కాగా, శాస్త్రవేత్తలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందనలు తెలిపారు.

Updated : 11 Sep 2019 12:10 PM GMT
Tags:    
Next Story
Share it
Top