మీ అందరినీ మిస్ అవుతున్నా: రోజా కన్నీరు - MicTv.in - Telugu News
mictv telugu

మీ అందరినీ మిస్ అవుతున్నా: రోజా కన్నీరు

April 14, 2022

 

rojaaaaa

‘జబర్ధస్త్ షో’ గురించి పత్యేకించి చెప్పనవసరం లేదు. ఈటీవీ ఛాలెన్‌లో ప్రతి గురువారం, శుక్రవారం కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతూ ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అంతేకాకుంగా ఈ షోకు దేశవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. షోను  వీక్షించిన పలువురు రాజకీయ నాయకులు, సినీ పెద్దలు అనేక ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో షోకు కొన్ని సంవత్సరాలపాటు రోజా జడ్జీగా వ్యవహరించారు. అప్పుడు పంచ్‌లు వేస్తూ, తన నవ్వులతో అందరిని అలరించారు.

ఇటీవలే రోజా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. త్వరలో ప్రసారం కానున్న జబర్థస్త్ షోకు సంబంధించిన ప్రోమోను గురువారం ఈటీవీ విడుదల చేసింది. ఈ ప్రోమోలో రోజా కన్నీటి పర్వతమైంది. ఆ షోకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ప్రోమోలో రోజా మాట్లాడుతూ.. ”ఈ స్టేజీ మీది నుంచే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. తాజాగా మంత్రి పదవి కూడా చేపట్టాను. అందుకు ఈటీవీకి పెద్ద థ్యాంక్యూ. అలాగే, మీ అందరినీ చాలా మిస్ అవుతాను. అందుకు చాలా బాధగా ఉంది. నాకు సర్వీసు చేయటం అంటే చాలా ఇష్టం. కానీ, నాకు ఎంతో ఇష్టమైన ఇలాంటి షోను వదులుకోక తప్పదు” అంటూ రోజా కన్నీరు మున్నీరు అయింది. మరోపక్క రోజా వీడ్కోలు ఎపిసోడ్‌లో ఇతర యాంకర్లు, ఆర్టిస్ట్‌లు కంటతడి పెట్టుకున్నారు. త్వరలోనే ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.