హైదరాబాద్ డాక్టర్.. బుర్ఖా కిడ్నాపర్లు దొరికారు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ డాక్టర్.. బుర్ఖా కిడ్నాపర్లు దొరికారు

October 28, 2020

Missing hyderabad doctor found in anantapur

మంగళవారం హైదరాబాద్‌లో పట్టపగలు ఓ డాక్టర్‌ను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన విషయం తెల్సిందే. కిడ్నాపర్లలో ఒకడు తనను కెమెరాలు గుర్తుపట్టకుండా ఒకడు బుర్ఖా వేసుకుని మరీ వచ్చాడు. బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. హిమాయత్ సాగర్ దగ్గర్లోని ఎక్సైజ్ అకాడమీలో నివసిసిన బెహజాట్ హుసాన్ (57) అనే వైద్యుణ్ని దండుగులు ఆయన అపార్ట్ మెంటు నుంచి కిడ్నాప్ చేశారు. AP9 Y 0031 నంబర్ ఉన్న కారులో ఎక్కించుకుని తీసుకుపోయారు.

ఈ కిడ్నాప్‌కు పాల్పడిన దుండగులను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్లు బెహజాట్ హుసాన్‌ను బెంగళూరువైపు తీసుకెళ్తుండగా రాప్తాడు సమీపంలో అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. రాత్రి రహదారిపై కాపు కాసిన పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒక్కడు మాత్రమే పట్టుబడగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. వైద్యుడిని రక్షించి హైదరాబాద్ తరలిస్తున్నారు.