కాకినాడ-షిర్డీ రైలుకు తప్పిన ముప్పు.. బోగీలను వదిలేసి - MicTv.in - Telugu News
mictv telugu

కాకినాడ-షిర్డీ రైలుకు తప్పిన ముప్పు.. బోగీలను వదిలేసి

February 21, 2020

fdbgcfgb

విజయవాడలో షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు శుక్రవారం తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. రైలు అజిత్‌సింగ్ నగర్‌లో ఉండగా ఇంజన్‌ నుంచి బోగీలు ఒక్కసారిగా వేరు అయిపోయాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యారు. రైలుకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో భోగీల్లో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

దీని గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. సమస్యను పరిష్కరించి రైలును అక్కడి నుంచి పంపించాం.  సాంకేతిక సమస్య తలెత్తడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నాం. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.