రైలులో పోయిన పర్సు 14 ఏళ్లకు దొరికింది.. ఎలా అంటే - MicTv.in - Telugu News
mictv telugu

రైలులో పోయిన పర్సు 14 ఏళ్లకు దొరికింది.. ఎలా అంటే

August 10, 2020

రైలులో పర్స్ పోయిందంటే ఇక దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా అది దొరకడం కష్టమే. కానీ ఓ వ్యక్తిని మాత్రం 14 ఏళ్ల క్రితం పోయిన పర్సు మళ్లీ తిరిగి వెతుక్కుంటూ వచ్చింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే అందులో ఉన్న ఒక్క రూపాయి కూడా పోలేదు. ఎలా ఉందో అలాగే అతన్ని చేరింది. మహారాష్ట్రలో ఇది జరిగింది. పోలీసులు ఆ పర్సును అతనికి చేర్చి డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశారు. 

అది 2006 సంవత్సరం. హేమంత్ పదాల్కర్ ముంబైలో లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా 2006లో పర్సు పోగొట్టుకున్నాడు. అందులో అప్పట్లో రూ. 900 ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రైలు రద్దీగా ఉండటంతో దొరకడం కష్టమేనని అనుకున్నాడు. కానీ 14 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ పర్సు దొరికింది. ఓ దొంగను పోలీసులు అరెస్టు చేయగా అప్పట్లో పోయిన హేమంత్‌దిగా గుర్తించారు. వెంటనే అతనికి ఫోన్ చేసి ఇటీవల అందించారు.  ఇంత కాలం తర్వాత తన పర్సు తిరిగి దొరకడంతో అదే షాక్‌లో దాన్ని తీసుకున్నాడు. అందులో రూ.900ల్లో రూ.300 ఇచ్చారు. మరో రూ.100 స్టాంప్ వర్క్ కోసం తీసుకోగా.. మిగతా రూ.500 నోటు రద్దైన నోటు కావడంతో దాన్ని ఎక్స్ ఛేంజ్  ఇస్తామని చెప్పారు. కాగా ఇంత కాలం వరకు కూడా అందులో డబ్బులు ఎవరూ తీయకపోవడం విశేషం.