అమెరికాలో శవమై తేలిన భారతీయ యువతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో శవమై తేలిన భారతీయ యువతి

January 17, 2020

Indian Women.

అమెరికాలోని భారతీయ కుటుంబంలో విషాదం నెలకొంది. గత డిసెంబర్ నెలలో అదృశ్యమైన సురీల్ దాబావాలా అనే యువతి శవమై కనిపించింది. తన కారులో విగత జీవిగా ఉండటాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చికాగోలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

గుజరాత్‌కు చెందిన సురీల్  దబావాలా చికాగోలోని లయోలా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది.  డిసెంబరు 30న బయటకు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. కంగారుపడిన ఆమె తండ్రి అష్రాఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. ఆమె ఆచూకీ చెప్పిన వారికి 10 వేల డాలర్లు రివార్డు కూడా ప్రకటించారు. ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ కారు ఢిక్కీలో విగత జీవిగా ఉండటాన్ని గుర్తించింది. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయారు. 

కారు డిక్కీలో ఉన్న ఆమె మృతదేహం దుప్పట్లో చుట్టి  ఉండటం పలు అనుమానాలు తావిస్తోంది. దీంతో ఆమెను ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య  అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సురీల్‌కు సన్నిహితులపై ఆరా తీస్తున్నారు. వారి కుటుంబానికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కొన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఆమె తండ్రి అష్రఫ్ దబావాలా  అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తున్నాడు.