చనిపోవాలని సముద్రంలోకి దూకింది.. 8 గంటల తర్వాత ఇలా.. - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోవాలని సముద్రంలోకి దూకింది.. 8 గంటల తర్వాత ఇలా..

September 30, 2020

Missing Women Found in See water in Colombia

చనిపోదామని సముద్రంలో దూకిన ఓ మహిళ అదృష్టవశాత్తు బతికి బయటపడింది. దాదాపు 8 గంటల పాటు నీళ్లలోనే తేలియాడుతూ కూడా సజీవంగా ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది. మత్స్యకారులను  ఆమెను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. కొలంబియాలో బుధవారం ఈ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అంతసేపు నీటిలో ఉన్నా కూడా ఏమి జరగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఎంజెలికా గైటన్‌ అనే మహిళ రెండేళ్ల క్రితం భర్త వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయింది. అప్పటి నుంచి కొంత కాలం వీధుల్లో కాలం గడిపింది. ఆ తర్వాత  కామినో డిఫే రెస్క్యూ సెంటర్‌లో ఆశ్రయం పొందింది. అక్కడ కూడా గడువు ముగియడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక చనిపోవడానికి సముద్రంలో దూకింది. ఉదయం 6 గంటల సమయంలో కొంత మంది మత్స్యకారులు ఆమె నీటిపై తేలుతుండటంతో గమనించి ఒడ్డుకు చేర్చారు. అప్పటికీ ఆమెకు ఊపిరి ఉండటంతో వైద్యం అందించారు. 

ప్రాణాలతో బయటపడటంతో ఎంజెలికా గైటన్ కూడా ఆశ్చర్యపోయింది. తాను మళ్లీ పుట్టానని, దేవుడు తన మరణాన్ని కోరుకోలేదంటూ ఆనందం వ్యక్తం చేసింది.  సముద్రంలో దూకిన తర్వాత స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదని చెప్పింది. తాను 20 సంవత్సరాలుగా  భర్త చేతిలో గృహహింసకు గురయ్యానని వెల్లడించింది. ఇద్దరు పిల్లలు ఉండటంతో భరిస్తూ వచ్చానని ఇప్పుడు వేధింపులు ఎక్కువ కావడంతో 2018లో తాను ఇంటి నుంచి పారిపోయి వచ్చానని తెలిపింది. ఎక్కడా ఆశ్రయంలేక చనిపోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.