ఏపీలోనూ ‘భగీరథ’.. రూ. 46వేల కోట్లతో భారీ పథకం..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలోనూ ‘భగీరథ’.. రూ. 46వేల కోట్లతో భారీ పథకం.. 

October 12, 2019

Mission bhageeratha like drinking water project in Andhra Pradesh 

తెలంగాణలోని ప్రతి జనావాసానికి మంచినీరు అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ’ లాంటి పథకం ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 47వేల జనాసావాలకు నీరు అందించడానికి రూ. 46,675 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తోంది. దీనికోసం ఏసియర్ డెలవప్‌ట్ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని యోచిస్తోంది. 

ప్రతిపాదిత వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు రూపకల్పన కోసం సీఎం జగన్ మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. సాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాజెక్టును డిజైన్ చేయనున్నారు. కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనాయరణ, అనిల్ కుమార్ యావ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. 2022 నాటికల్లా ఈ ప్రాజెక్టను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ప్రాజెక్టు కనీసం 30 ఏళ్ల సేవలు అందించేలా ఉంటుందని బుగ్గన చెప్పారు.