భగీరథ ట్యాంకు కూల్చివేత..15 లక్షలు మట్టిపాలు  - MicTv.in - Telugu News
mictv telugu

భగీరథ ట్యాంకు కూల్చివేత..15 లక్షలు మట్టిపాలు 

July 4, 2020

ngvnvb

కొండపోచమ్మ రిజర్వాయర్ కాలువకు పడిన గండిపై దుమారాన్ని మరవక ముందే మరో నాణ్యతాలోపం బయటపడండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు కింద నిర్మించిన ఓ ట్యాంకు ప్రారంభానికి ముందే కుప్పకూలింది. సరైన పునాది లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురైంది. 

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని వంగూరు మండ‌లంల చింత‌ప‌ల్లిలో మూడు మిష‌న్ భ‌గీర‌థ కోసం వాట‌ర్ ట్యాంకులు నిర్మించారు. వీటిలో ఒకటి ఇదివరకే ప‌క్క‌కు ఒరిగిపోయింది. దాని పక్కనే స్కూల్ ఉండ‌టంతో అధికారులు కూల్చేశారు.  దీని నిర్మాణానికి రూ. 15 ల‌క్ష‌లు వెచ్చించారు. నాణ్యత లేని సామగ్రితోనే కట్టడం వల్లే ఈ ట్యాంక్ బలహీన పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.