కరోనా పేషెంట్లను గుర్తించడానికి మరో యాప్ రెడీ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పేషెంట్లను గుర్తించడానికి మరో యాప్ రెడీ

October 30, 2020

కరోనా వైరస్ బాధితులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెల్సిందే. ఈ యాప్‌ను మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకుంటే సమీపంలో ఎవరైనా కరోనా బాధితులు ఉంటే అలర్ట్ చేస్తుంది. తాజాగా లక్షణాలు కనిపించకుండానే కరోనా వైరస్ బారిన పడుతున్న వారిని గుర్తించడానికి శాస్త్రవేత్తలు మరో యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను వినియోగించి ఎవరైనా సరే తమలో కరోనా లక్షణాలు ఉన్నాయా? లేదా? అని తెలుసుకోవచ్చు. 

అమెరికాలోకి ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి (ఎమ్ఐటి) చెందిన రీసర్చర్లు ఈ యాప్‌ను రూపొందించారు. ఒక వ్యక్తి దగ్గే తీరు, పలికే పదాలను బట్టి ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అని యాప్ నిర్ధారిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యాప్ పని చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆప్ వినియోగదారులు తమ దగ్గును, మాటలను వెబ్ బ్రౌజర్లు, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ డివైజెస్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వీటిని యాప్ తన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. తన వద్ద ఉన్న వేలాది దగ్గులు, పదాల ఉచ్ఛారణలతో పోల్చి ఆ వ్యక్తికి కరోనా సోకిందా అనే విషయాన్ని నిర్ధారిస్తుందని శాస్తవేత్తలు వెల్లడించారు. త్వరలోనే ఈ యాప్ మార్కెట్‌లోకి రానుంది.